05-01-2026 12:00:00 AM
మహిళల ప్రీమియర్ లీగ్
ముంబై, జనవరి 4 : మహిళల ప్రీమియ ర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌కు వచ్చే వారమే తెరలేవబోతోంది. ఈ సీజన్‌కు ముందు యూపీ వారియర్జ్ సంచలన నిర్ణ యం తీసుకుంది. ప్రస్తుత కెప్టెన్ దీప్తి శర్మపై వేటు వేసి ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్ కొత్త సారథిగా నియమించింది. ఈ విషయా న్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. గత సీజన్ వరకూ దీప్తి శర్మ కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఇకపై సాధారణ ప్లేయర్‌గా కొన సాగుతుంది.
దీప్తి శర్మను యూపీ యాజమాన్యం రూ.3.2 కోట్లు వెచ్చించి తిరిగి దక్కించుకుంది. అదే సమయంలో 33 ఏళ్ల లాన్నింగ్‌ను వేలంలో రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది. లాన్నింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా తిరుగులేని రికార్డుంది. ఆస్ట్రేలియాకు ఒక వన్డే ప్రపంచకప్, 4 టీ20 ప్రపంచకప్‌లు అందించింది. డబ్ల్యూపీఎల్‌లోనూ సారథిగా తనదైన ముద్ర వేసింది. గతంలో ఆమె ఢిల్లీ క్యాపిటల్స్‌ను మూడుసా ర్లు ఫైనల్‌కు చేర్చింది.
అయితే వేలానికి ముందు డీసీ యాజమాన్యం ఆమెను రిలీజ్ చేసింది. బ్యాటర్‌గానూ లాన్నింగ్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఆమె సారథ్యంలోనైనా యూపీ వారియర్జ్ మెరుగ్గా రాణిస్తుందేమో తూడాలి. డబ్ల్యూపీఎల్ 2023 సీజన్‌లో మూడో స్థానంలో నిలిచిన యూపీ 2024 నాలుగో స్థానంలోనూ, 2025లో ఐదో స్థానానికి పడిపోయింది.