05-01-2026 12:00:00 AM
రూట్,బ్రూక్ హాఫ్ సెంచరీలు
ఇంగ్లాండ్ స్కోర్ 211/4
సిడ్నీ, జనవరి 4 : యాషెస్ సిరీస్‌లో భాగంగా చివరి టెస్ట్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. తొలిరోజు ఇంగ్లాండ్ దూకుడుగా ఆడితే వరణుడు వారి జోరుకు బ్రేక్ వేశాడు. వర్షం కారణంగా కేవలం 45 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైనప్పటకీ ఇంగ్లీష్ టీమ్‌దే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 57 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. పిచ్ పేసర్లకు సహకరించడంతో మిఛెల్ స్టార్క్, స్కాట్ బొలాండ్, మైఖేల్ నెసర్ చెలరేగారు. దీంతో ఓపెనర్లు జాక్ క్రాలే (16), బెన్ డకెట్ (27) పరుగులకే ఔటవగా.. జాకబ్ బెథెల్(10) కూడా విఫలమయ్యాడు.
ఈ దశలో జో రూట్, హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజే యంగా 154 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 45 ఓవర్ల తర్వాత వర్షం అం తరాయం కలిగించింది. దాదాపు రెండు గం టల పాటు వర్షం కురుస్తూనే ఉండడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం తగ్గినప్పటకీ వెలుతురు లేమి కారణంగా ఆటను కొనసాగించడం సాధ్యం కాలేదు.
దీంతో తొలిరోజు ఆట ముగిసినట్టు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 211 పరుగులు చేసింది. రూట్ 8 ఫోర్ల తో 72 నాటౌట్, బ్రూక్ 6 ఫోర్లు, 1 సిక్సర్‌త 78 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇప్పటికే కైవసం చేసుకుంది. వరుసగా మూడు టెస్టుల్లోనూ ఆసీస్ విజయం సాధిస్తే..బాక్సింగ్ డే టెస్టులో మా త్రం ఇంగ్లాండ్ గెలిచింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను కూడా తీసుకోలేదు. దీంతో 138 ఏళ్ల తర్వాత సిడ్నీలో ఒక టెస్ట్ కోసం స్పిన్నర్ లేకుండా ఆడడం ఆసీస్‌కు ఇదే తొలిసారి.