calender_icon.png 26 January, 2026 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిమ్స్‌లో మెగా రక్తదాన శిబిరం

26-01-2026 03:05:29 AM

ముకరంపుర, జనవరి 25 (విజయ క్రాంతి): కిమ్స్ డిగ్రీ, పిజి, హోటల్ మేనేజ్ మెంటు కళాశాలలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కిమ్స్ విద్యా సంస్థల ఛైర్మెన్ డాక్టర్ పే ర్యాల రవీందర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా దాదాపు 50 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా తమ రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ విద్యాసంస్థల వైస్ ఛైర్మెన్ సాకేత్ రామారావు, ప్రిన్సిపాల్లు అర్జున్ రావు, గౌతమ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.