26-01-2026 03:07:24 AM
రాంచీలో జరిగే టోర్నీకి నలుగురు విద్యార్థుల ఎంపిక
హుజురాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): హుజురాబాద్ గడ్డపై హాకీ స్టిక్ పట్టిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందిన నలుగురు వి ద్యార్థులు ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికై ప్రాంతం పేరును మారుమోగించారు.
ఎంపికైన క్రీడాకారులు వీరే...
వనపర్తి జిల్లాలో ఇటీవల (జనవరి 9, 10, 11 తేదీలలో) జరిగిన 69 రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఈ కిం ది విద్యార్థులు జాతీయ జట్టులో చోటు సం పాదించుకున్నారు.నిమ్మటూరి లవణీ ప్రియ పదవ తరగతి (ఏకశిలా పాఠశాల, సిబిఎస్సీ),ఈ. రిషిక తొమ్మిదవ తరగతి (ఆల్ఫో ర్స్ జీనియస్ పాఠశాల), సాదుల అభినయ్ ఎనిమిదవ తరగతి (వివేకవర్ధిని పాఠశాల), కే. చరణ్ తొమ్మిదవ తరగతి (తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సైనిక్ పాఠశాల, కరీంనగర్) చెందిన వారు. ఈ నెల 27 నుండి జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరగనున్న జాతీయ స్థాయి హాకీ టోర్నీలో వీరు పాల్గొననున్నా రు. రాష్ట్ర జట్టు తరపున ఆడుతూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు క్రీడాకారులు ఇప్ప టికే సిద్ధమయ్యారు. జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను హుజురాబాద్ హాకీ క్లబ్ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు ఘనం గా అభినందించారు.
అభినందించిన వారిలో...
తోట రాజేంద్రప్రసాద్ (హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడు), తిరుపతి (క్లబ్ సెక్రట రీ), బండ శ్రీనివాస్ (జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు), కొలిపాక శ్రీనివాస్ ( మాజీ అధ్యక్షుడు),గంగిశెట్టి ఉమామహేశ్వర్ (మాజీ సెక్రటరీ), సీనియర్ క్రీడాకారులు పి ఈ టీ వేముల రవి కుమార్, ఎండి. సజ్జు, భూసారపు శంకర్, సాదుల శ్యాం కుమార్, టి. శ్రీనివాస్, మాటూరి రాజేష్, సాయి కృ ష్ణ, కాయంకంటి రాజేష్, గుడ్డేలుగుల ప్రదీ ప్, సబ్బని విక్రం, మోటపోతుల విక్రమ్, విన య్, వంశీ, విపుల్ బన్నీ, రాజ్ కుమార్, మి థున్, మధు, ఎగశిర ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ దినేష్ రెడ్డి, దేఖవర్ధిని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్‌తో పాటు తదితరులు అభినందించారు. వీరు జాతీయ స్థాయిలో విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.