calender_icon.png 23 October, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల త్యాగాలతోనే ప్రశాంతత

23-10-2025 12:38:56 AM

-పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

-రక్తదానం చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఆదిలాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో  నిర్వహించిన మెగా రక్తదాన  శిబిరానికి భారీ ఎత్తున స్పందన లభించింది. బుధవారం ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  రిబ్బ న్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరాలలో దాదాపు జిల్లా వ్యాప్తంగా 817 యూనిట్ల రక్తాన్ని పోలీసులు, ప్రజలు, ఔత్సాహికుల రక్తాన్ని రిమ్స్ బ్లడ్ బ్యాంకుకు అందజేసినట్లు ఎస్పీ తెలిపారు.

జిల్లా ఎస్పీ స్వయంగా  రక్తదానం చేసి సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా ఎస్పీ స్వయంగా ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితమే ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా ప్రశాంత వాతావరణకి కారణమని గుర్తు చేశారు. రాత్రనకా, పగలనకా, పండుగలు, కుటుంబ సభ్యులను విడిచి, ప్రజా ధన ప్రాణ మాన రక్షణలో 24 గంటలు పోలీసు యంత్రాంగం విధి నిర్వహణలో ఉంటారని తెలిపారు.

రక్తం అనేది జీవితాలను కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 

ఈ రక్తదాన శిబిరంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు,  రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎస్పీలు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, ఇంద్ర వర్ధన్, పట్టణ సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిమ్స్ డాక్టర్లు, సిబ్బంది, ఎన్జీవో నాయకులు, ప్రజలు, యువజన సం ఘాలు, ప్రైవేటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.