23-08-2025 12:16:06 AM
మెగాస్టార్ చిరంజీవి 70 పుట్టినరోజు వేడుకలతో శుక్రవారం ఇండస్ట్రీ అంతా సందడిగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న సినిమాల అప్‌డేట్స్‌తో కూడా మేకర్స్ రెండు రోజులుగా అదరగొడుతున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ గ్లింప్స్ గురువారం అభిమానుల్లో జోష్ నింపింది. ఇప్పుడు ఆయన నటిస్తున్న మరో సినిమాల అప్‌డేట్స్ వచ్చాయి.
అందులో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ‘మెగా157’ టైటిల్ గ్లింప్స్ కాగా, చిరంజీవిని బాబి కొల్లి మరోమారు డైరెక్ట్ చేస్తున్న విషయాన్నీ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు నటిస్తున్న 157వ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో అభిమానుల కోలాహలం మధ్య జరిగింది. ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనే టైటిల్ పెట్టారు. ‘పండగకి వస్తున్నారు’ అనేది ట్యాగ్‌లైన్. టైటిల్ రివీల్ గ్లింప్స్ స్టులిష్ మాస్ ఎంటర్‌టైనర్‌కు టోన్ సెట్ చేసింది. చిరంజీవి కారులో పవర్‌ఫుల్ ఎంట్రీ ఇస్తూ, తన ట్రేడ్ మార్క్ స్వాగ్‌లో కమాండోల పక్కన నడుస్తుండగా గ్లింప్స్ ప్రారంభమవుతుంది.
ఈ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్న విక్టరీ వెంకటేశ్ వాయిస్‌తో గ్లింప్స్ రూపొందించడం సర్‌ప్రైజ్‌గా అనిపించింది. 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడిగా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
తమిళ సంస్థ బ్యానర్‌లో ౧౫౮వ చిత్రం
బ్లాక్‌బస్టర్ కాంబో మెగాస్టార్ చిరంజీవి కొల్లి రీయూనియన్‌కి అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. శుక్రవారం మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఇది చిరుకి ౧౫౮వ సినిమా. దీన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీస్థాయిలో నిర్మించనుంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరు కలయికలో వస్తున్న ఈ చిత్రానికి సం బంధించి కాన్సెప్ట్ పోస్టర్‌తోనే మ్యాసీవ్ ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేశారు.
గోడను బలంగా కొడుతు న్న గొడ్డలి, దాని కింద ‘The blade that set the bloody benchmark’ అని రాసి ఉన్న వ్యాఖ్య ఈ సినిమా ఎంత బలమైన కథతో రూపొందనుందో తెలియజేస్తోంది. చిరంజీవిని ఎప్పుడూ చూడని కొత్త పాత్రలో చూపించడానికి బాబీ శక్తిమంతమైన స్క్రిప్టు ను సిద్ధం చేశారని టీమ్ పేర్కొం టోంది. తమిళంలో ‘జననాయగన్’, ‘టాక్సిక్’, ‘బాలన్’ వంటి వరుస బ్లాక్‌బస్టర్లతో దూసుకు పోతున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌తో తెలుగు సినీరంగంలోకి అడుగు పెడుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇదే ఏడాది చివరలో మొదలు కానున్నాయి.