calender_icon.png 15 August, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంను కలిసిన సీడ్స్‌మెన్ అసోసియేషన్ సభ్యులు

15-08-2025 01:01:35 AM

కొత్తపల్లి, ఆగష్టు 14(విజయక్రాంతి) : సెప్టెంబర్ మాసంలో నిర్వహించనున్న సీడ్స్‌మెన్ అసోసియేషన్ యొక్క 30వ వార్షి కోత్సవ కార్యక్రమానికి మానకొండూర్ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.క వ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో  సీడ్స్ మెన్ అసోసియేషన్ సభ్యులు బుధవారం రోజున జూబ్లీహిల్స్ లోని నివాస గృహంలో రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలవడం జరిగింది.

సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి సీడ్స్‌మెన్ అసోసియేషన్ ఆహ్వానాన్ని మన్నించి హాజరు అగుటకు సంసిద్దతను తెలియచేసారు. ఈ కార్యక్రమములో సీడ్స్‌మెన్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ జి ఎన్ వి రామకృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీ ఎస్ రమేష్ రెడ్డి, కార్యదర్శి శ్రీ ఎ. రఘు వాసు, కోశాధికారి శ్రీ వి శ్రీనివాస్, మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ శ్రీ. రామిడి తిరుమల్ రెడ్డి మరియు డైరెక్టర్ శ్రీ. ఆర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 14 (విజయక్రాంతి) : జిల్లాలోని రుద్రంగి గ్రామపంచా యతీ ఆవరణలో రుద్రంగి మండల పరిధిలో రూ.4 లక్షల 37 వేల విలువ గల 13 సీఎం సహాయనిధి చెక్కులను రాష్ర్ట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  స్థానిక నాయకులతో కలసి లబ్దిదారులకు పంపిణీ చేశారు.