calender_icon.png 15 August, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాలతో భద్రత మరింత బలోపేతం

15-08-2025 01:02:13 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి, (మహ బూబాబాద్) ఆగస్టు 14 (విజయక్రాంతి): సీసీ కెమెరాల ఏర్పాటుతో భూపాలపల్లి పట్టణ భద్రత మరింత బలోపేతం కానుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన 160 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ కెమెరాలు ద్వారా నేర నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రజల భద్రతకు దోహదపడుతాయని చెప్పారు. సాంకేతిక విధానం అమలు చేయడం వల్ల నేరాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన దాతలను ఎమ్మెల్యే సత్కరించారు.