calender_icon.png 2 May, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటి జ్ఞాపకాలు.. నేటి పలకరింపులు

21-04-2025 12:34:08 AM

25 సంవత్సరాల తర్వాత అపూర్వ కలయిక

సూర్యాపేట, ఏప్రిల్ 20 : 25 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు.అప్పుడు విద్యార్థులు ఇప్పుడు ఉద్యోగులు, వ్యాపారస్తులు  ఒకరినొకరు గుర్తు పట్టేందుకు కొంత సమయం పట్టింది.. మరికొందరికి చాలా సమయం పట్టింది... హల్ మొత్తం నవ్వులతో నిండిపోయింది.

జిల్లా కేంద్రం లోని కుడకుడ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల లో 1999-2000 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం  ఆత్మకూర్ (ఎస్) మండలం లోని నేమ్మికల్ లో గల  ఎస్ ఆర్ -గార్డెన్స్ లో కలుసుకున్నారు.నాటి జ్ఞాపకాలను, తోటి స్నేహితులతో అనుభవాలు గుర్తు చేసుకున్నారు.ఆప్యాయంగా పలకరించుకున్నారు.

నాటి గురువులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.షీల్ లు అందజేశారు.అనంతరం ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. 25 సంవత్సరాల తర్వాత నాటి విద్యార్థులంతా కలుసుకోవడం  చాలా సంతోషంగా ఉందన్నారు. ఒకరినొకరు సహకరించుకుంటూ జీవితంలో ఎన్నో మైలురాయలు దాటాలని ఆకాంక్షించాడు.

విద్యార్థులు ప్రత్యేక నృత్యలు, ఆట పాటలు,క్వ  తో కొలహాలంగా మారింది.. చివరగా సాయంత్రం ఇండ్లకు వెళ్ళేటప్పుడు ఆనంద బాష్పలతో హాలు నుంచి బయటకు వెళ్లారు.ఈకార్యక్రం లో పూర్వ విద్యార్థులు కంచుగట్ల ప్రవీణ్, శంకర్, రవి, క్రాంతి, షాహిద్, పున్నయ్య, విశ్వవాణి,కవిత, నిర్మలతో పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.