calender_icon.png 2 May, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెక్కల కష్టం వర్షార్పణం..!

21-04-2025 12:34:07 AM

  1. అకాల వర్షంతో తడిసిన  మొక్కజొన్న ధాన్యం 
  2. వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి రక్షణ కరువు 
  3. తీవ్ర నష్టాలపాలైతున్న రైతాంగం 
  4. ముందస్తు చర్యలకు వెనుకబడిన అధికార యంత్రాంగం 

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 20 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో కురిసిన అకాల వర్షంతో రైతాంగం ఉక్కురి బిక్కిరవుతోంది. సరిగ్గా కోత దశకు వచ్చిన మొక్కజొన్న వర్షానికి తడిసి ముద్దవుతోంది. ఆరుగాలం కష్టప డి పండించిన పంట చివరికి అకాల వర్షం తో తడిసిపోవడంతో రైతులంతా తల్లడిలుతున్నారు. వాతావరణ సమస్యలతో తెగుళ్లు భారి నుండి పంటను కాపాడేందుకు అప్పు లు చేసిన రైతులు చివరికి పంట దిగుబడిని ఆశిస్తూ మార్కెట్కు ధాన్యాన్ని తీసుకొస్తే మార్కెట్లోనూ ధాన్యానికి రక్షణ లేకపోవడంతో రైతులంతా కంట కన్నీరు పెట్టుకుం టున్నారు.

ధాన్యం మార్కెట్కు తెచ్చిన వెంట నే అకాల వర్షాల నేపథ్యంలో ముందస్తు ఏ ర్పాట్లు చేయాల్సి ఉన్నా ధాన్యానికి రక్షణగా టార్పిన్లను కూడా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షపు చినుకులతో మార్కెట్లో ఆరబోసిన ధాన్యం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఒక్కో రైతుకు సంబంధించిన సుమారు  రెం డు నుంచి నాలుగు క్వింటాళ్ల ధాన్యం వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది.

దీంతోపాటు వరు సగా మరుసటి రోజు కూడా ఇదే వర్షం కొనసాగితే తడిసిన ధాన్యం పూర్తిగా బూజు పట్టి దాన్యం పనికిరాకుండా పోతుందని చివరికి ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏంటని గోడున విలవిస్తున్నారు. ఇప్పటికే ఆశించిన స్థాయిలో దిగుబడి రాక అప్పుల బారిన పడినట్లు మదన పడుతున్న రైతులకు అకాల వర్షాలు కూడా మరింత భాదిస్తున్నాయి.

దీంతోపాటు మా ర్కెట్లో సరైన సదుపాయాలు లేక ధాన్యానికి రక్షణ లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు మధన పడుతున్నారు. ధా న్యం అమ్ముకునే సమయంలోను కాంటాదారులు ఇతర వ్యాపారులు తేమ తరుగు పేరు తో అడ్డగోలుగా దోచుకుంటున్నారని రైతు లు వాపోతున్నారు. అకాల వర్షాల నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు చర్యలకు ఆదేశించినా జిల్లా యంత్రాంగం ఆ దిశగా అడు గులు వేయకపోవడంతో రైతులకు శాపంగా మారుతుంది.

వర్షానికి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ రైతు పేరు సుం కరి నాగన్న గౌడ్ ఆవురాసు పల్లి గ్రామం తానకున్న రెండెకరాల పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. శనివారం మధ్యాహ్నం మొక్కజొన్న ధాన్యాన్ని మార్కెట్కు తీసుకురాగా రక్షణ కోసం టార్పిన్లు అడిగితే అధికారులు లేవని చెప్పినట్లు తెలిపాడు. ఆదివా రం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షంతో ఆ ధాన్యంలో సగం పైగా వర్షం నీటిలో కొట్టుకుపోయింది. 

జిల్లాలో అంతటా ఇదే పరిస్థితి. !

నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి అచ్చంపేట కొల్లాపూర్ నాగర్ కర్నూల్ మా ర్కెట్ యార్డ్ లతోపాటు రైతులు సమీప ప్ర ధాన రోడ్ల వెంట మొక్కజొన్న ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. ఆదివారం కురిసిన అకా ల వర్షంతో ఆ ధాన్యం అంత తడిసి ముద్దయింది.

ఆయా మార్కెట్ కేంద్రాలకు తరలించిన ధాన్యానికి కూడా అధికారులు తగిన ఏ ర్పాట్లు చేయకపోవడంతో అక్కడ ధాన్యమంతా వర్షంలో కొట్టుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆ దేశించిన జిల్లా మార్కెటింగ్ శాఖ యంత్రాం గం ఆ దిశగా పనిచేయకపోవడంతో ప్రస్తు తం రైతుల పరిస్థితి అధోగతి పాలవుతోంది.