calender_icon.png 3 November, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌కు రానున్నమెస్సి

02-11-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, నవంబర్ 1 : హైదరాబాద్ సాకర్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే వార్త... అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి హైదరాబాద్‌కు రానున్నాడు. డిసెంబర్‌లో భారత్ పర్యటనకు రానున్న మెస్సి దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో సందడి చేయనున్నాడు. అయితే మెస్సి టూర్‌లో మొదట కేరళ పేరు ఉండగ అనివార్య కారణాలతో అది రద్దయింది. దీంతో కేరళ ప్లేస్‌లో హైదరాబాద్‌ను ఎంపిక చేశారు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నా యి. ఈ పర్యటనలో మెస్సి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడడంతో పాటు అభిమానులను కలవనున్నాడు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడి యం లేదా గచ్చిబౌలీలో స్టేడియంలో మెస్సి ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు.

డిసెంబర్ 12 అర్థరాత్రి తర్వాత కోల్‌కత్తా చేరుకోనున్న మెస్సి అదే రోజు సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరువుతాడు. అదే రోజు హైదారాబాద్‌కు వచ్చి అభిమానులను కలుస్తాడు. డిసెంబర్ 14న ముంబై, 15న ఢిల్లీ పర్యటించనున్న మెస్సి ప్రధాని మోదీతోనూ సమావేశం కానున్నాడు.