calender_icon.png 9 December, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మృతి మంధాన ప్రాక్టీస్ షురూ

09-12-2025 01:19:53 AM

ఇండోర్, డిసెంబర్ 8 : భారత మహిళల జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో వివాహం రద్దయిందని ప్రకటించిన 24 గంటల్లోపే నెట్స్‌లో అడుగుపెట్టింది. త్వరలో శ్రీలంకతో జరగనున్న సిరీస్ కోసం స్మృతి సన్నద్ధమవుతోంది. స్మృతి ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను ఆమె సోదరుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.

నవంబర్ 23న పలాశ్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉండగా అనూ హ్య పరిస్థితులతో వాయిదా పడింది. స్మృతి తండ్రి గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరడం, తర్వాత పలాశ్ కూడా ఆసుపత్రి పాలవడం వంటి పరిణామాలతో గందరగోళం నెలకొంది. ఆదివారం తన పెళ్లి రద్దయినట్టు సోషల్ మీడియా వేదికగా స్మృతి ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని కోరింది. ఇకపై క్రికెట్‌పైనే తన ఫోకస్ అంతా అంటూ రాసుకొచ్చింది. తాను అన్నట్టుగానే తన బ్రేకప్ బాధ నుంచి డైవర్ట్ అయ్యేందుకు మళ్లీ బ్యాట్ పట్టింది.