03-07-2025 01:23:43 AM
నల్లగొండ టౌన్, జూలై 2 : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ పరిధిలో నిర్వహించిన డిగ్రీ రెగ్యులర్. బ్యాక్లాగ్ పరీక్షల డిగ్రీ సెమిస్టరీ ఫలితాలను బుధవారం ఎం జీ యు లో ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి ,సిఓఈ ఉపేందర్ రెడ్డి లు కలిసి విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ లో 6071 మంది విద్యార్థులు హాజరుకాగా 1,321 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
4, 722 మంది ప్రమోట్ కాగా 20 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ లో ఉండగా ఉత్తీర్ణత 21.76 శాతం, రెండవ సెమిస్టర్ 10,413 మంది విద్యార్థులు హాజరు కాగా, 2453 మంది ఉత్తీర్ణత మంది ప్రమోట్ కాగా 36 మంది మాల్ ప్రాక్టీస్ లో ఉంచగా ఉత్తీర్ణత 23.5 6 శాతం సాధించారు. మూడో సెమిస్టర్ లో 5112 మంది విద్యార్థులు హాజరు కాగా, 1589 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 3,499 మంది ప్రమోట్ కాగా,24 మంది మాల్ ప్రాక్టీస్ లో ఉండగా ఉత్తీర్ణత 31.08 శాతం, నాలుగో సెమిస్టర్ లో8,664 మంది విద్యార్థులు హాజరు కాగా 3,123 మంది ఉత్తీర్ణత సాధించగా 5,270 మంది ప్రమోట్ కాగా 34 మంది ని మాల్ ప్రాక్టీస్ లో ఉంచగా ఉత్తీర్ణత 36.05 శాతం ఐదవ సెమిస్టర్ లో 4,172 మంది విద్యార్థులు హాజరు కాగా 1,545 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు 2,613 మంది ప్రమోట్ కాగా 14 మందిని మాల్ ప్రాక్టీస్ లో ఉంచగా ఉత్తీర్ణత 37.03 శాతం, సాధించారు.
ఆరవ సెమిస్టర్ లో8,488 మంది విద్యార్థులు హాజరు కాగా 3,910 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.4,557 మంది ప్రమోట్ కాగా 21 మందిని మాల్ ప్రాక్టీస్ లో ఉంచారు. ఉత్తీర్ణత 46.07 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సి ఓ ఈ డా ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వ్బుసైట్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలి పారు. ఈనెల 10వ తేదీ వరకు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కు అవకాశం ఉందని వెల్లడించారు. అడిషనల్ కోఆర్డినేటర్లు డా లక్ష్మీప్రభ , డా ప్రవళిక, కోఆర్డినేటర్ బిక్షమయ్య పాల్గొన్నారు.