22-11-2025 01:45:48 AM
సంగారెడ్డి కోహీర్‌లో 7.4 డిగ్రీలు నమోదు
23 నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు
హైదరాబాద్, నవంబర్ 2౧ (విజయక్రాంతి): రాష్ట్రంలో రానున్న రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు నమోదవుతాయని తెలిపింది. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 8.7 డిగ్రీలు, సంగారెడ్డి కోహీర్‌లో అత్యల్పంగా 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల23 నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.