22-11-2025 01:48:23 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి లతో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని తహసిల్దార్లు, మం డల పరిషత్ అభివృద్ధి అధికారులు, సబ్ ఇన్స్పెక్టర్లతో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల లో తీసుకోవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్, సభ్యుల ఎన్నికల నిర్వహణకు తీసుకోవలసిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వ హించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించడం జరుగు తుందని తెలిపారు. గొడవలు జరిగిన పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సబ్ ఇన్స్పెక్టర్ సంతకాలతో అందించాలని తెలిపా రు.
ఆయా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, డెడికేషన్ కమిషన్ కేటాయించిన ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 22వ తేదీలోగా ఓటరు జాబితాలోని అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలపై వచ్చిన అభ్యం తరాలను పరిష్కరించాలని, 23వ తేదీన తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డివిజనల్ పం చాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.