12-07-2025 12:57:24 AM
42 శాతం రిజర్వేషన్లపై బీసీ సంఘాల హర్షం
హైదరాబాద్, జులై 11 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంపై బీసీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, బీసీ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేష్ తదితరులు ఉన్నారు.