22-01-2026 01:28:54 AM
మాగనూరు జనవరి 21. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-త్రీ లో సీనియర్ అసిస్టెం ట్ గా ఉద్యోగం సంపాదించిన పారేవుల ప్రశాంత్ కుమార్ రెడ్డి ని బుధవారం మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మక్తల్ క్యాంప్ కార్యాలయంలో శాలువా ,పూలములతో సన్మానించారు.
ఈ సం దర్భంగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూమాగనూరు మండలం అడవి సత్యారం గ్రామానికి చెందిన పారేవుల ప్రశాంత్ కుమార్ రెడ్డి నిరుపేద కుటుంబంలో జన్మించి పట్టుదల తో చదివి గ్రూప్- త్రీ ఉద్యోగం సంపాదించుకోవడం చాలా అభినందనీయమన్నారు. ప్రస్తుతం జోగులాంబగద్వాల జిల్లాలో సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం రావడం జరిగిందని తెలిపారు . ఈ కార్యక్రమంలో మక్తల్ సీఐ .రామ్ లాల్ ,మాగనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆనంద్ గౌడు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.