21-12-2025 01:06:16 AM
సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలి
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను సన్మానించిన మంత్రి
హుజూర్‌నగర్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): సర్పంచ్‌లు ప్రథమ పౌరుడిగా బాధ్య తలు నిర్వర్తించి అభివృద్ధికి పాటుపడి ప్రభు త్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయేలా కృషి చేస్తూ శాంతి భద్రతలు కాపాడాలని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నా రు. శనివారం పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు,ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను మంత్రి ఘనంగా సన్మానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ చరిత్ర లో నిలిచిపోయేలా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోనే ప్రతి పేదవారికి ఆరు కేజీల ఉచిత సన్న బియ్యం అమలు చేసే పథకం ప్రారంభించామన్నారు. అలాగే అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. బెట్టే తండా, జాన్‌పాహడ్, నక్కగూడెం, వెల్లటూరు, దొండపాడు లిఫ్ట్ ఇరిగేషన్లు త్వర లో పూర్తి అవడంతో హుజూర్‌నగర్ నియోజకవర్గం సస్య శ్యామలమవుతుందని మంత్రి తెలిపారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు చేసేందుకు అర్హుల జాబితా తయారు చేయాలని ఆయన కోరారు. గ్రామపంచాయ తీ ఎన్నికల్లో కష్టపడిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేయడంతో అలాగే గెలిచిన సర్పంచ్‌లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తక్కువ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వారికి పార్టీ ప్రతి విషయంలో ప్రాధాన్యత నిస్తూ అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడవద్దని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికా అరుణ్ కుమార్, సుబ్బారావు, నాగన్న,గూడెపు శ్రీనివాస్, కోతి సంపత్ రెడ్డి,అజీజ్ పాషా, దొంతగాని శ్రీనివాస్,పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, నూతన సర్పంచులు, వివిధ మండలాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.