calender_icon.png 23 December, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుల్లో పోలీసులు పారదర్శకత పాటించాలి

23-12-2025 12:15:41 AM

ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

రామగుండం పోలీస్ స్టేషన్ తనిఖీలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

రామగుండం,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ రామగుండం పోలీస్ స్టేషన్ ను పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న డీసీపీ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ సందర్శించి పిటిషన్ లను వాటి రికార్డ్ లను తనిఖీ చేశారు. నమోదు చేయబడిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలు, పెండింగ్ కేసులు వివరాలు, ప్రజలతో, ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారు,  పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను ఎస్ఐ సంధ్యారాణి ని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మహిళా సిబ్బందిని అన్ని డ్యూటీలు చేసే విధంగా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో  గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ ఐ సంధ్య రాణి ఉన్నారు.