calender_icon.png 23 December, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ విచ్ఛిన్నానికి గాదె ఇన్నయ్య కుట్ర!

23-12-2025 12:18:53 AM

  1. ఎన్‌ఐఏ అభియోగం
  2. ఇన్నయ్యకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  3. చంచల్‌గూడ జైలుకు తరలింపు
  4. ఇన్నయ్య అరెస్టు అప్రజాస్వామికం: సీపీఐ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంతోపాటు దేశంలో విధ్వంసాలకు కుట్ర పన్నారని సామాజిక కార్యకర్త, అనా థాశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ లోని ఆయన ఆశ్రమంలో అదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ నాంపల్లిలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపర చగా, న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా,  ఇన్నయ్యపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. 

అసలేం జరిగింది?

అక్టోబర్ 18న అనారోగ్యంతో మరణించిన మావోయిస్టు అగ్రనేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు గాదె ఇన్న య్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మావోయిస్టులకు అనుకూలంగా నినాదాలు చేయడమే కాకుండా, ప్రజలను ఉద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారని పోలీసులు ఆరోపి స్తున్నారు. మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పోరాట మార్గమే శరణ్యమని ఆయ న వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఈ చర్యలు దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇన్నయ్య అరెస్టు సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఐఏ అధికారులు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కేవలం భావజాల ప్రచారమే కాకుం డా, దేశంలో విధ్వంసాలకు కుట్ర పన్నారని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన కార్యకలాపాలు సాగిస్తున్నారని నివేదికలో పొం దుపరిచారు.

అప్రజాస్వామిక చర్య: సీపీఐ 

గాదె ఇన్నయ్య అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యద ర్శి జాన్‌వెస్లీ ఖండించా రు. సామాజిక కార్యకర్త ను, అనాథలను సాకు తు న్న వ్యక్తిని మావోయిస్టు సానుభూతిపరుడనే నెపంతో అరెస్టు చేయ డం అప్రజాస్వామికమని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆపరేషన్ కగార్‌లో భాగంగానే ఈ అరెస్టు లు జరుగుతున్నాయని ఆ రోపించారు. ప్రశ్నించే గొం తుకలను, సామాజిక సమస్యలపై స్పందించే వారిని అణచేసేందుకే ఉపా వంటి నల్ల చట్టాలను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఇది ముమ్మాటికీ భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా అభి వర్ణిం చిన ఆయన, ప్రజాస్వామిక వాదులందరూ ఈ అరెస్టు ను వ్యతిరేకించాలన్నారు.