04-07-2024 01:06:23 AM
న్యూఢిల్లీ, జూలై 3: కేంద్ర ప్రభుత్వం బుధవారం ఎనిమిది క్యాబినెట్ కమిటీలను ఏర్పాటు చేసింది. చాలా కమిటీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వం వహించనున్నారు. ప్రధాని కాకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదిరత మంత్రులు కేంద్రం ప్రకటించిన క్యాబినెట్ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డిలకు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీల్లో చోటు దక్కంది. రామ్మోహన్ నాయుడు రెండు కమిటీల్లో చోటు దక్కించుకోగా.. కిషన్ రెడ్డికి రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు దక్కింది.
కేంద్రం ప్రకటించిన ఎనిమిది క్యాబినెట్ కమిటీలు