calender_icon.png 10 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైప్ లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలి

09-09-2025 09:59:21 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బల్దియా పరిధిలో కొద్దిరోజుల క్రితం దెబ్బతిన్న మంచినీటి పైప్ లైన్ కు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్(Commissioner Rajeshwar) సిబ్బందిని ఆదేశించారు. చాలా రోజుల క్రితం పైప్ లైన్ మరమ్మతుల కోసం రోడ్డును తవ్వి వదిలివేయగా, పలువురు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అలాగే తాగునీటి సరఫరాకు ఆటంకం కలుగుతుందని ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కమిషనర్ పైప్ లైన్ పనుల ప్రదేశాన్ని మంగళవారం పరిశీలించి, వెంటనే పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.