calender_icon.png 19 August, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

19-08-2025 01:03:37 AM

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు, మొక్కలు నాటడం శ్రమదానం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.

విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ... బాగా చదువుకోవాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు చదువు ఒక్కటే మార్గం అని, ముందే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధన కోసం కృషి చేయాలన్నారు. చదువుతోపాటు, మొక్కలు నాటడం, శ్రమదానం చేయటం, పరిశుభ్రత కార్యక్రమాలు వంటివి విద్యార్థి దశ నుండి చేపట్టాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని ఇస్తాయని అన్నారు.