19-08-2025 01:05:19 AM
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లా ల్లో జోరు వానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు రికార్డు స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు, ములు గు జిల్లాలో సోమవారం భారీ వర్షా లు కురిశాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో జీడి వాగు ఉధృతికి బ్రిడ్జి పైనుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాల్వపెల్లి గ్రామంలో తుమ్మల వాగులో మహి ళ గల్లంతైంది.
ఇదే జిల్లాలోని వెంకటాపురం బీసీ హాస్టల్ ప్రహరీ కూలిపోగా, హాస్టల్ చుట్టూ నడుములోతు వరదనీరు చేరింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల తో అతలాకుతలం అవుతున్నది. వేల ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. రోడ్లు తెగిన పలు గ్రామా లకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లా షెట్లుర్ వద్ద నలుగురు గొర్రెల కాపరులు, ఇద్దరు రైతు లు, 500కు పైగా గొర్రెలు వాగులో చిక్కుకున్నారు.
ఎన్‌డీఎస్ బలగాల సాయంతో ఒడ్డుకు చేరుకున్నారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. మేడ్చల్‌లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరి, ప్రజలు ఇబ్బందిపడ్డారు. భద్రాద్రి జిల్లాలో గోదావరి ఉప్పొంగుతున్నది. భద్రాచలం వద్ద సోమవారం 38 అడుగులకు నీటిమట్టం చేరుకున్నది.
ఇక నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు 9 గేట్లను సోమవారం అధికారులు ఎత్తారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తారు. శ్రీశైలానికి భారీగా వరద వస్తుండటంతో 10 గేట్లు పైకెత్తి దిగువకు నీటి విడుదల చేశారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
ములుగు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ఏటూరునాగారం/వాజేడు, ఆగస్టు 18 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ములుగు జిల్లాను సోమ వారం భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు పొంగి రోడ్ల మీద నుంచి ప్రవహిస్తున్నాయి. ఏటూరునాగారం జీడి వాగు బ్రిడ్జిపై వరద ఉధృతి పెరిగి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జీడి వాగు సమీపంలో భారీ వర్షా నికి ఓ చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయిం ది.
దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. చింతూరు గ్రామంతో పాటు పలు గ్రామాల్లో మిర్చి నారుమళ్లు వర్షపు నీటిలో మునిగాయి. వెంకటాపురం శివారు కంకల వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. స్థానిక బీసీ హాస్టల్ ప్రహరీ కూలిపోవడంతో హాస్టల్ చుట్టూ నడుములోతు వరదనీరు చేరింది. దీంతో విద్యార్థులు గదుల నుంచి బయటకు రావలేని పరిస్థితి ఏర్పడటంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
వెంకటాపురం ఓల్డ్ ఐటిడిఏ భవనాలు శిథిలావస్థలో ఉండటంతో కూలిపోతాయని స్థానికులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుం బం అక్కడే నివాసముండటంతో ఆందోళన నెలకొంది. మంగపేట మండలంలోని పలు గ్రా మాల్లో ఇళ్లు నీట మునిగాయి. రోడ్ల పైనుం చి వాగులు ప్రవహించడంతో రాకపోకలు హనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పచ్చని పొలాల్లో ఎటుచూసినా ఇసుక మేటలు, రాళ్లు రప్పలు దర్శనమిస్తున్నాయి.
వెంకటాపురం, వాజేడు మండలాల్లో కుంభవృష్టి కారణంగా జనజీవనం అతలాకుత మైంది. వాగులు, వంకలు రికార్డు స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో పల్లపు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు బొగత జలపాతానికి వరద పెరిగింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు పర్యాటకులను జలపాతం సందర్శనకు అనుమతించడం లేదు.
కాల్వపెల్లిలో మహిళ గల్లంతు
తాడ్వాయి (విజయక్రాంతి): ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని కాల్వపెల్లి గ్రామంలోని తుమ్మల వాగులో మహిళ ఆదివారం రాత్రి గల్లంతయింది. గ్రామానికి చెందిన సోలం సారమ్మ(48) ఆదివారం రాత్రి తుమ్మల వాగు సమీపంలో బహుర్భూమికి వెళ్లింది. ఇంతలోనే భారీవర్షానికి వాగుపొంగి ప్రవహిం చడంతో సారమ్మ వాగులోపడి కొట్టుకుపోయింది. సోమవారం వాగులోనే మృతదేహం చెట్టుకు చిక్కుకుని కనిపించింది.