19-08-2025 01:30:48 AM
- మిడ్ మానేరుకు పెరిగిన ఇన్ ఫ్లో
- 7.333 టీఎంసీలకు చేరుకున్న ఎల్‌ఎండీ
కరీంనగర్, ఆగస్టు 18 (విజయ క్రాంతి): భారీ వర్షాలతో గోదావరి పోటెత్తడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. శ్రీరాంసాగర్ ప్రా జెక్టు నీటిమట్టం 80 టీఎంసీలు దాటగా శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని విడుదల చే యడంతో ఇన్ ఫ్లో పెరిగి 12 టీఎంసీలకు చేరువయింది. ఎల్‌ఎండీకి ఇన్ ఎక్కువగా ఉండడంతో ఒక్క టీఎంసీ మాత్రమే పెరిగి 7.5 టీఎంసీలకు చేరుకుంది.
అప్పర్ మా నేరు డ్యాం నిండుకుండను తలపిస్తున్నది. మహారాష్ట్రతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది. వర్షాలు ఇదే వి ధంగా ఉంటే ఉమ్మడి జిల్లాలో చెరువులు, కుంటలు నిండనున్నాయి. మిడ్ మానేరు సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా సోమవారం మధ్యాహ్నం నాటికి 8.12 టీఎం సీలకు చేరుకుంది. 14,530 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కాగా ఎస్సారెస్సీ వరద కాలువ ద్వారా 2100 క్యూసెక్కులు, గాయత్రి పంపుహౌజ్ ద్వారా 12,250 క్యూసెక్కుల నీరు మిడ్ మానేరులోకి వచ్చి చేరుతున్నది.
శ్రీపాద ఎల్లంపల్లి నీటి సామర్థ్యం 20.15 టీఎంసీలు కాగా 19.64 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ ఫ్లో 53,050 క్యూసెక్కులు గోదావరి ద్వారా వచ్చి చేరుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి 8 గేట్లను ఎత్తి 53,050 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అప్పర్ మానేరు సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.59 టీఎంసీలు ఉంది. ఇన్ ఫ్లో 455 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. కరీంనగర్ సమీపంలోని ఎస్ ఎండీనీటి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.333 టీఎంసీలకు చేరుకుం ది. ఇన్ ఫ్లో 1145 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. మానేరు నది నుండి 1095 క్యూసె క్కుల నీరు వచ్చిచేరుతుంది.