17-05-2025 12:24:56 AM
చిగురుమామిడి, మే 16 (విజయ క్రాం తి): చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మో త్సవాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రథోత్సవంలో పాల్గొని గ్రామస్థులతో కలిసి రథాన్ని లాగారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
కొండపైకి దారి ఏర్పాటు చేయాలని అడిగారని, వర్షం వచ్చినప్పుడు దేవాలయానికి నీళ్లు వస్తున్నాయి ఆ సమస్య పరిష్కారం చేస్తామని అన్నారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యా యని, ప్రజలంతా పుష్కరాల్లో పాల్గొనాలని అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధి వర్షాలతో పాడిపంట లతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నానన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అన్ని కార్యక్ర మాలు సజావుగా జరిగేలా దేవుడి ఆశీర్వా దం ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు.