calender_icon.png 26 January, 2026 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచినీటి పైప్‌లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

26-01-2026 03:09:35 AM

కరీంనగర్, జనవరి 25 (విజయ క్రాంతి): నగరంలోని 45వ డివిజన్ మంకమ్మతోటలో 7 లక్షల రూపాయల సాధారణ నిధులతో 300 మీటర్ల మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి ఆదివారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతతో త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టరుకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, గుగ్గిళ్ళ జయశ్రీ - శ్రీనివాస్, మైనార్టీ నగర శాఖ అధ్యక్షులు సౌకత్ అలీ, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, సుడా మాజీ డైరెక్టర్ నేతి రవివర్మ, నాయకులు మెతుకు సత్యం, బిఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం ప్రతినిధులు వొడ్నాల రాజు, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, శ్రీనివాస్, మిడిదొడ్డి నవీన్, నందెల్లి చిన్న, మహేష్, అంజలి, తదితరులు పాల్గొన్నారు