14-12-2024 12:06:33 PM
హైదరాబాద్: తెలంగాణ ఉన్న గురుకులాలను శనివారం నాడు మంత్రులు సందర్శించారు. షేక్ పేట గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. తరగతి గదిలో డిజిటల్ బోర్డు పనితీరును మంత్రి పరిశీలించారు. అటు భద్రాద్రి జిల్లా దమ్మపేట మండటం గుండుగులపల్లిలోని గురుకుల పాఠశాలలో కామన్ మెనూ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో గురుకులాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి సందర్శించనున్నారు. భూపాలపల్లి జిల్లాలో దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు గురుకులాలను సందర్శించనున్నారు.