06-01-2026 08:43:28 PM
వనపర్తి టౌన్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 44వ తెలంగాణ రాష్ట్ర మహాసభలు జనవరి 3, 4, 5 తేదీలలో శంషాబాద్‌లోఘనంగానిర్వహించబడ్డాయి.ఈ మహాసభల సందర్భంగా వనపర్తి జిల్లా కన్వీనర్‌గా పనిచేస్తున్న అర్జున్ సాతర్లని రెండవసారి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్‌గా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డా.రావుల కృష్ణ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అర్జున్ సాతర్ల మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తన శక్తి మేరకు నిరంతరం పోరాడుతానని, విద్యార్థుల హక్కుల కోసంఏబీవీపీజెండాకిందఉద్యమిస్తానని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా వనపర్తి జిల్లాకు చెందిన ఏబీవీపీ నాయకులకు రాష్ట్ర స్థాయి బాధ్యతలు కల్పిస్తూ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కార్తీక్ , శివ కుమార్ ను కూడా నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు డా.రావుల కృష్ణ ప్రకటించారు. ఈ నియామకాలు వనపర్తి జిల్లాకు గర్వకారణమని, జిల్లాలో ఏబీవీపీ ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తాయని నాయకులు అభిప్రాయపడ్డారు.ఈ మహాసభలు విద్యార్థి లోకానికి దిశానిర్దేశం చేసే విధంగా విజయవంతంగా ముగిశాయని ఏబీవీపీ నాయకులు తెలిపారు.