calender_icon.png 18 September, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్యాయాలను నిలదీస్తున్నందుకే.. నాపై కేసులు: హరీశ్ రావు

03-12-2024 05:02:17 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై కేసు నమోదు చేయడంపై ఎక్స్ వేదికగా హరీశ్ రావు స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయాలను అడుగడుగున ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకు భరించలేకే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తప్పు చేసి దబాయించడం, కేసులు పెట్టడమే సీఎంకు తెలుసన్నారు. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేశావన్నందుకు యాదగిరి గుట్ట పీఎస్ లో కేసు, ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే బేగంబజార్ పీఎస్ లో కేసు పెట్టించారన్నారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టులకు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో తనపై సంబంధం లేని కేసు నమోదైందన్నారు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే తలాతోక లేకుండా మానుకొండూరులో కేసొకటి పెట్టించావని ముఖ్యమత్రిపై హరీశ్ రావు మండిపడ్డారు. లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, ప్రజల ప్రక్షాన ప్రశ్నించడం ఆపను అన్నారు. ప్రజాకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శిక్ష పడేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటా అని హరీశ్ రావు స్పష్టం చేశారు.