calender_icon.png 17 July, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టాల్లో ఉన్నప్పటికీ హామీలు నెరవేరుస్తున్నాం: మంత్రి తుమ్మల

16-07-2025 01:11:21 PM

  1. ప్రతి జిల్లాలో ఒక పామాయిల్ పరిశ్రమ.
  2. ఆయిల్ పామ్ తోటలతో తక్కువ శ్రమ.. ఎక్కువ ఆదాయం.
  3. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీమళ్లీ ఆశీర్వదించాలి.
  4. ఆడ బిడ్డలు ఆశీర్వదిస్తేనే.. ప్రభుత్వం చల్లగా ఉంటుంది.
  5. ఇల్లు ఇచ్చినా.. రేషన్ కార్డు ఇచ్చినా మహిళల పేరు మీదే.

హైదరాబాద్:  పెద్దపల్లి జిల్లాలో బుధవారం నాడు నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు సభలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల(Minister Tummala Nageswara Rao) మాట్లాడుతూ... ఏ వ్యాపారమైనా మహిళలకే ఇవ్వాలని మంత్రి సీతక్క చెప్తున్నారని పేర్కొన్నారు. ఇల్లు ఇచ్చినా.. రేషన్ కార్డు ఇచ్చినా మహిళల పేరు మీదే అన్నారు. ఆడబిడ్డల ఆశీర్వదిస్తే.. ఇల్లు అయినా.. ప్రభుత్వం అయినా చల్లగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ హామీలు నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో ఒకేసారి రూ. 21 వేలు కోట్లు వేశామన్నారు. పంటలు వేసే సమయంలోనే రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారని చెప్పారు.

రైతుభరోసా కింద(Rythu Bharosa) రైతుల ఖాతాల్లో 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లు వేశామని తెలిపారు. తక్కువ ఇబ్బందులు, ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను రైతులు ఎంచుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్(Oil Palm) ను రైతులు సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్ తోటల కోసం ఎకరానికి రూ. 1.50 లక్షలను రాయితీ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఒక పామాయిల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ తోటలతో తక్కువ శ్రమ, ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ మళ్లీ ఆశీర్వదించాలని మంత్రి తుమ్మల కోరారు.