03-01-2026 01:26:39 PM
మహిళల హక్కుల పోరాటానికి మార్గదర్శి సావిత్రిబాయి పూలే
మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలకు స్పూర్తి.
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో( Jangampalli village) మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి మహిళల ఆర్థిక స్వతంత్రానికి,కుల వివక్షతకు కృషి చేసిన మహనీయురాలని జంగంపల్లి సర్పంచ్ వాణి వాసు యాదవ్ అన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఆయన నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో విద్యను అభ్యసించి ఉపాధ్యాయురాలుగా సేవలు అందించారని అన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళల విద్య కోసం కృషి చేస్తూ ఎన్నో పాఠశాలలు,సామాజిక సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ వాణివాసు యాదవ్, ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి సిద్దారములు, వార్డ్ సభ్యులు సుజాత, అరుణ, ఎల్లవ బాను ప్రకాష్ బుచ్చయ్య రవి ,యశ్వంత్, సిద్దారములు, గ్రామ పెద్దలు బాలచంద్రం శివలింగం సత్యం లు పాల్గొన్నారు.