13-08-2024 07:03:15 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జూలై 18 నుంచి ఆగస్టు 5వరకు జరిగిన డీఎస్సీ పరీక్ష ఆన్సర్ కీని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికార వెబ్‌సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/ కీ తో పాటు రెస్పాన్స్ షీట్ లు అందుబాటులో ఉంచారు. తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల ఉన్నాయి. ఈ పరీక్షకు మొత్తం 2,79,957 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,45,263 మంది హాజరయ్యారు. 34,694 మంది పరీక్షలు రాయలేదు. అభ్యర్థులు ఈ నెల 20 లోపు తమ అభ్యంతరాలను తెలపాలని ఆయన పేర్కొన్నారు.