30-01-2026 12:00:00 AM
మానకొండూరు, జనవరి 29 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేం ద్రంలో సమ్మక్క సారలమ్మ అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వనదేవతల ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమా లు విజయవంతంగా ముందుకు పోవాలని అమ్మవారిని వేడుకున్నామని మంత్రి చెప్పారు.పేదల కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు దిగ్విజయంగా నిరంతరాయంగా కొనసాగాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు.