calender_icon.png 30 January, 2026 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ ఆస్పత్రిలో అన్నదానం

30-01-2026 12:00:00 AM

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ఎంఎన్‌జె క్యాన్సర్ ఆస్పత్రిలో రోగు లకు, వారి సహాయకులకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనీ (ముజీబ్) గురువారం అన్నదానం చేశారు. అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ప్రతి వారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ సేవలో భాగంగా, ఈ వారం కూడా డాక్టర్ ముజీబ్ స్వయంగా పాల్గొని రోగులకు భోజన పంపిణీ చేశారు.

కార్యక్రమంలో టిఎన్‌జిఓ హైదరాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఖాలెద్ అహ్మద్, శంకర్, ఎంఎన్‌జె క్యాన్సర్ ఆస్పత్రి యూనిట్ ప్రెసిడెంట్ శివకుమార్, కార్యదర్శి చంద్రశేఖర్,  తెలంగాణ ఉర్దూ ఆఫీసర్స్ అధ్యక్షుడు జాయిను ద్దీన్, జిల్లా, యూనిట్ సభ్యులు నయీమ్,  హరీష్, హైదరాబాద్ జిల్లా ఏపీఆర్వో మ హ్మద్ వహీద్, మహ్మద్ ముస్తాఫా తదిత రులు పాల్గొన్నారు.