calender_icon.png 21 July, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవార్లకు ప్రత్యేక పూజలు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

21-07-2025 01:28:43 AM

ముషీరాబాద్, జూలై 20: ఆషాడ మాసం బోనాల పం డుగ సందర్భంగా ఆదివారం ముషీరాబాద్ నియోజక వ ర్గంలో ఆలయాల వద్ద బోనాల వేడుకలను ఘనంగా జరు పుకున్నారు.   

కవాడిగూడ డివిజన్లోని లో యర్ ట్యాంక్ బండ్‌లో గల శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఆలయ ట్రస్టీ చైర్మన్ గౌతమ్ కుమార్ పటేల్, ఈవో సాంబశివరావు, ప్రధాన పూజారి సాత్విక్ శర్మ నేతృత్వంలో జరిగిన ఉత్సవాలకు  మంత్రి శ్రీధర్ బాబు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, వ్యవసాయ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు బీఆర్‌ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాసరావు,  కార్పొరేటర్ రచనశ్రీ, టిఆర్‌ఎస్ నేత  ముఠా జై సింహ హాజరై పూజలు చేశారు. మహంకాళి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు, వై.  చంద్రమౌళి , కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్, రాంనగర్ కార్పొరేటర్ రవి చారి, అడిక్మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ పాల్గొన్నారు.