21-07-2025 01:29:13 AM
కొత్తకోట జులై 20 : బిసి కుల సంఘాల ఐక్యవేదిక మండల కన్వీనర్ గౌనికాడి రా ములు యాదవ్ హైదరాబాద్ నగరం మేడిపల్లి లోని క్యూ న్యూస్ కార్యాలయంలో ఎ మ్మెల్సీ తీన్మార్ మల్లన్నను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల ఆఫీస్ పై దాడి జ రిపి ఫర్నిచర్ ధ్వంసం చేసి మల్లన్న పై హత్య యత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
బీసీ కులాల ఐక్యత ను ఓర్వాలేకనే అగ్రకుల పార్టీల నాయకులు బీసీ నేతలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఇలాంటి దాడు లు చేస్తున్నారని దాడులకు బీసీలు భయపడే ప్రసక్తే లేదన్నారు రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు. నూటికి 90% ఉన్న వర్గాల ఓట్లతో గెలిచి బీసీ లను విడగొట్టాలని చూస్తున్నారని బీసీలపై దాడులు చేసిన ప్రోత్సహించిన వారికి తగిన గుణపాఠం చెప్తామన్నారు.