calender_icon.png 27 October, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ టీ20 వరల్డ్ కప్

27-10-2025 12:48:33 AM

- 2026 మెగాటోర్నీకి జట్టు కూర్పుపై దృష్టి 

-ఆ పది మంది ఖాయం.. మిగిలిన ఐదుగురు ఎవరో ?

హైదరాబాద్, అక్టోబర్ 26: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికలుగా టీ ట్వంటీ ప్రపంచకప్ జరగబోతోంది. 2024లో టైటిల్ గెలి చి టీ20 ఫార్మాట్‌లో రారాజుగా ఉన్న టీమిండియా మరోసారి దానిని నిలబెట్టుకునేందుకు రేసులో ఉంది. ఈ మెగా టోర్నీకి సరిగ్గా మూడు నెలల సమయం మిగిలుండగా ఈ లోపు భారత్ 15 టీ ట్వంటీలు ఆడ నుంది.

వరల్డ్‌కప్ కోసం ప్రిపరేషన్ ఆస్ట్రేలియా సిరీస్ నుంచే మొదలుకానుంది. ఇక్కడ నుంచి భారత్ ఆడే ప్రతీ సిరీస్‌లో టీ ట్వంటీలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో జట్టు కూర్పును సెట్ చేసుకునేందుకు ఆసీస్ టూ ర్ నుంచే శ్రీకారం చుట్టబోతోంది. ప్రపంచకప్ కోసం 15 మందిని ఎంపిక చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 10 మంది ఆటగాళ్ళు ఖరారైనట్టే. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఆల్‌రౌండర్ కోటాలో హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్, స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, పేసర్లుగా బుమ్రా, అర్షదీప్ సింగ్ ఖచ్చితంగా జట్టులో ఉంటారు.

గత టీ ట్వంటీ ప్రపంచకప్‌లోనూ, ఇటీవల ఆసియాకప్‌లో వీరంతా మ్యాచ్ విన్నర్లే కావడంతో వీరి స్థానాలకు ఢోకా లేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్నాడు. ఇటీవల ఆసియాకప్‌లో అతను ఎలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడా డో అందరూ చూశారు. అతనితో పాటు గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలోనూ, తర్వాత తిలక్ వర్మ ఉంటారు. అలాగే హార్థిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా చోటు దక్కించుకుంటాడు.

స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ మ్యాచ్ విన్నర్లే. అలాగే పేస్ విభాగంలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుం డా మన బౌలింగ్‌ను ఊహించుకోలేం. అదే సమయంలో టీ ట్వంటీల్లో భారత్ నుంచి బెస్ట్ బౌలర్‌గా ఉన్న అర్షదీప్ కూడా కీలకం. అయితే మిగిలిన ఐదు స్థానాల కోసం పోటీ మామూలుగా లేదు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మలలో ఎవరికి చోటు దక్కుతుందనేది చూడా లి. ఇక్కడ నుంచి జరగబోయే ప్రతీ సిరీస్‌లో నిలకడగా రాణించిన ప్లేయర్స్‌కే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుంది.

దీంతో సంజూ, జితేశ్‌లలో ఎవరు తమ కు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటారనేది చూడాలి. అలాగే బ్యాటింగ్ లో ఫినిషర్ రోల్‌కు సంబంధించి శివమ్ దూబే, రింకూ సింగ్‌లకు ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో తెలుగుతేజం నితీష్ కుమార్‌రెడ్డి కూడా రేసులో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతామన్న కోచ్ గంభీర్ మాటల ప్రకారం చూస్తే టీ20 ఫార్మాటలో నూ అతన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉం టుంది.

ఎందుకంటే ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్ళలో నితీష్ కూడా ఉన్నాడు. మరో ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్, పేస్ విభాగంలో హర్షిత్ రాణా, సిరాజ్ కూడా పోటీలో ఉంటారు. గంభీర్ ప్రియశిష్యుడిగా పేరున్న హర్షిత్‌కు కూడా ఛాన్స్ దక్కే అవకాశాలను కొట్టిపారేయలేం. సిరాజ్‌కు టీ20 జట్టులో ప్రయారిటీ ఇస్తారా అన్నది డౌటే. అలాగే రిషబ్ పంత్‌కు టీ20 జట్టులో చోటు దక్కడం కష్టమేనని భావిస్తున్నారు.

అయితే ఇప్పటి నుంచి జరగబోయే ప్రతీ సిరీస్‌లో ఆయా ఆటగాళ్ళ ప్రదర్శన, గాయాలు, ఫిట్‌నెస్ వంటి అంశాలపైనే ప్రపంచకప్ జట్టులో ప్లేస్ ఆధారపడి ఉం టుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఐదు టీ ట్వంటీలు ఆడనున్న టీమిండియా తర్వాత సొంతగడ్డపై సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల తో ఐదేసి మ్యాచ్‌లు ఆడబోతోంది. కాగా టీ20 ప్రపంచకప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి జరగనున్నాయి.