27-10-2025 12:46:36 AM
-వర్షంతో భారత్, బంగ్లా మ్యాచ్ రద్దు
-మహిళల వన్డే ప్రపంచకప్
నవీ ముంబై, అక్టోబర్ 26 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ చివరి లీగ్ మ్యాచ్ వర్షంతో రద్దయింది. పూర్తి మ్యాచ్ సాధ్యం కాకున్నా ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌కు ముందు భారత బౌలర్లు ప్రాక్టీస్ చేసు కున్నారు. వర్షంతో ఈ మ్యాచ్‌ను మొదట 27 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భార త్ బౌలింగ్ ఎంచుకుంది.
వికెట్ కీపర్ బ్యాట ర్ రిఛా ఘోష్‌కు విశ్రాంతినివ్వడంతో ఉమా ఛెత్రి అరంగేట్రం చేసింది. క్రాంతి గౌడ,స్నేహా రాణాకు కూడా విశ్రాంచినిచ్చారు. ఏ దశలోనూ బంగ్లా భారత్‌కు పోటీనివ్వలేకపో యింది. షర్మిన్ (36), శోభన(26) తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. బం గ్లా బ్యాటింగ్‌లో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
దీంతో బంగ్లాదేశ్ 27 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు చేసింది. భారత బౌ లర్లలో రాధా యాదవ్ (3/30), శ్రీచరణి (2/23), అమన్‌జోత్ కౌర్ (1/18), రేణుక (1/23), దీప్తి శర్మ (1/24) రాణించారు.డక్‌వర్త్ లూయిస్ విధానం ప్రకారం 126 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు ఓ పెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఫామ్ లో ఉన్న ఫీల్డింగ్ చేస్తూ ప్రతీకా రావల్ గాయపడడంతో స్మృతి మం ధానతో కలిసి అమన్‌జోత్ కౌర్ ఇన్నింగ్స్ ఆరంభించింది.
వీరిద్దరూ తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలో 57 పరుగులు జోడించగా..వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గే అవకాశాలు కనిపించకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే సెమీస్‌కు క్వాలిఫై కావడంతో భారత్ లీగ్ స్టేజ్‌ను 7 పాయింట్లతో నాలుగో స్థానంలో ముగించింది. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించడంతోనే భారత్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.