calender_icon.png 6 May, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పొంగులేటి ప్రకటన బాధాకరం

03-05-2025 10:00:35 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం గందరగోళ ప్రకటనలు చేయడం బాధాకరమని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల సర్వేలు ఎల్1 ఎల్2 ఎల్3 అంటూ మూడు విభాగాలు చేయడం ఆ విభాగాల లో విడుదలవారీగా ఇస్తామని గతంలో ప్రకటించారు. ఎంపికలు జరిగేటప్పుడు ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లో ఎక్కడ ఉన్న ఇండ్లు మంజూరు చేయాలి అంటూ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. అంతేకాకుండా గతంలో ప్రభుత్వం రూ 5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తుంది లబ్ధిదారుడు ఎంత పెద్ద ఇల్లు అయినా అదనంగా డబ్బులు వేసుకొని నిర్మించుకోవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి అనేకసార్లు ప్రకటించి, ప్రస్తుతం 600 గజాలు ఉండాలి,700 గజాలు ఉండాలి అంతలోనే నిర్మించాలంటూ లబ్ధిదారులను గందరగోళంలో పడేస్తున్నారని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుండడంతో అధికారులు సైతం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు.   అవినీతి అక్రమాలు జరిగితే అధికారులే బాధ్యత వహిస్తారని  ప్రభుత్వం ప్రకటిస్తుండడంతో  అధికారులు బలయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వమే ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఎల్ వన్ లో నిరుపేదలకు ఇవ్వలేకపోతుండడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాలకు కేవలం 500 ఇండ్లు కాదని ఎల్ 1 ఎంతమంది ఎంపిక చేయబడితే అంతమందికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం 36 వార్డులకు వార్డుకు 25 చొప్పున 2,500 ఇండ్లు ఇవ్వాలని ఉమ్మడి జిల్లా మంత్రి పొంగులేటి కొత్త గూడానికి ప్రత్యేక ప్రాధాన్యతతో ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.  రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి  రోజుకో విధంగా ప్రకటించడం సరైంది కాదన్నారు.