11-12-2025 12:01:21 AM
కరీంనగర్, డిసెంబరు 10 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణానికి చెందిన రుద్రాంశ్ విశ్వ అను రెండు సంవత్సరాల బాలుడు 386 వస్తువుల పేర్లు, వివిధ రాష్ట్రాల పేర్లు, దేశాల పేర్లు, శ్లోకాలు గుర్తించడంతో ప్రతిభ గుర్తించి కలామ్స్ వరల్ రికారడ్స్ వారు ఎక్స్ట్రా గ్రాస్టింగ్ పవర్ జీనియస్ కిడ్ 2025 అచీవర్ అవార్డ్ ను ప్రకటించారు. బాలుని తల్లిదండ్రులు బుధవారం ఎమ్మెల్యే గంగులను వారి నివాసంలో కలిశారు.
ప్రపంచ పటంలోని దేశాలను అలవోకగా గుర్తించి వాటి పేర్లను ఎమ్మెల్యే కు బాలుడు తెలియచేశారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా కలాం వరల్ రికార్డు అవార్డుని బాలునికి అందజేసి అభినందించారు. అబ్బాయి భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి గొప్ప స్థాయిలో ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు మాధురి-శ్రవణ్ కుమార్, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, బిఆర్ ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, తదితరులుపాల్గొన్నారు.