15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

14న తేజస్ స్కాలర్‌షిప్ టాలెంట్ టెస్ట్

11-12-2025 12:00 AM

ముకరంపుర, డిసెంబరు 10 (విజయ క్రాంతి): తేజస్ ఐఐటి, నీట్ అకాడమీ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులలో ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈనెల 14న ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు తేజస్ అకాడమీలో స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్- 2025 నిర్వహించనున్నట్లు తేజస్ అకాడమీ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు తెలిపారు.

బుధవారం స్కాలర్షిప్ టెస్టు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తి గల విద్యార్థులు స్కాలర్షిప్ టెస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ లో మెరిట్ సాధించిన విద్యార్థులకు  10 నుంచి 50% వరకు ట్యూషన్ ఫీజులో రాయితి ఇస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 8106310960, 8106366661, 9849466661 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి కిషన్ రెడ్డి, అధ్యాపక, అధ్యాపకేతర బృందంపాల్గొన్నారు