09-01-2026 12:26:34 AM
కరీంనగర్, జనవరి 8 (విజయ క్రాంతి): మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గురువారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. కరీంనగర్ నగరంలోని ఆరేపల్లిలో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ చేశారు. ఆరేపల్లి శివారులోని స్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ చౌరస్తాలో గల కియా కార్ షోరూమ్ లో నూతన మోడల్ సెల్టాస్ కార్ ను ప్రారంభించారు.
కృష్ణానగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన సొసైటీ టీ స్టాల్ ను ప్రారంభించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మేదరి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరించారు. పటేల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రికెట్ లీగ్ కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.