09-01-2026 12:25:16 AM
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి) : సామ్రాజ్యవాదుల కంటే ఆర్‌ఎస్‌ఎస్ భావజలం కలిగిన బీజేపే ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశ స్వాతంత్య్రం కో సం గాంధీజీ నాయకత్వంలో అనేక పోరాటాలు, ఆందోళన జరిగితే సామ్రాజ్యవా దు లైన బ్రిటిష్ పాలకులు ఏ ఒక్కరోజు కూడా గాంధీజీపై లాఠీ ఎత్తలేదని స్పష్టం చేశారు. కానీ స్వాతంత్రం వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే పట్టపగలు ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులు గాంధీజీని కాల్చి చంపారని మండిపడ్డారు.
దేశానికి దిశా నిర్దేశం చేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను రాష్ర్టంలోని ప్రజలందరికీ వివరించాలని డిప్యూటీ సీఎం తెలిపారు. కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని రాష్ర్ట శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్న మొట్టమొదటి ఏకైక రాష్ర్టం తెలంగాణ అని భట్టి పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులు తెచ్చేందుకు భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, వరకట్న వ్యతిరేక చట్టం, అంటరానితనం నిర్మూలన, 20 సూత్రాల ఆర్థిక పథకం, హిందూ కోడ్ బిల్, ఆహార హక్కు చట్టం వంటి అనేక చట్టాలను తీసుకొచ్చింది. అందులో భాగంగా దేశంలోని కోట్లాది ప్రజలకు ఉపాధిని భద్రతను కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
ఈ దేశంలో గణనీయమైన మార్పులు తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొస్తే .. బీజేపీ ప్రభుత్వం అలాంటి ఒక్క చట్టమైనా తీసుకొచ్చిందా.. ? కేవలం కాంగ్రెస్ ప్రభు త్వం తెచ్చిన చట్టాలను రద్దు చేయడమే బీజే పీ చేస్తున్న పని తప్ప మరొకటి లేదు’ అని భట్టి విమర్శించారు. కొత్త ఉపాధి చట్టంలో ఉపాధి పనులకు అవకాశం లేకుండా పోయింది’ అని అన్నారు. దీంతో పేదలు పట్టణాలకు వలసపోయే ప్రమాదం ఉంద ని, ఇప్పుడు యజమానులు ఎంత కూలీ ఇస్తే అంత తీసుకునే పరిస్థితి వచ్చిందని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
పాత చట్టంలో కాంట్రాక్టర్లకు స్థానం లేదని, ఇప్పుడు కాం ట్రాక్టులతో కలిసి పని చేసుకునేలా చట్టంలో మార్పు తీసుకొచ్చారని మండిపడ్డారు. గ తంలో కేంద్రమే పూర్తిగా నిధులు ఇచ్చేదని, ఇప్పుడు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం అంటూ కొత్త నిబంధన తెచ్చారని ఆయన విమర్శించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలు తమ వాటా 40 శాతం చెల్లించకపోతే.. మొత్తం నిధులు కేటాయించకుండా చేసి ఆ పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని భట్టి అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న దక్షణాది రాష్ట్రాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధు ల్లో భారీ వ్యత్యాసం ఉంటుందని భట్టి వివరించారు. కొత్త ఉపాధి చట్టం రద్దు కోసం ఆందోళనలు నిర్వహించాలని, ప్రభుత్వ పెద్ద లు భాగస్వామ్యం కావాలని అన్నారు.