01-12-2024 02:03:23 PM
పటాన్ చెరు,(విజయక్రాంతి): పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శాంతి నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిగా హాజరై అయ్యప్పను దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించడం ద్వారా భక్తి భావంతో పాటు క్రమశిక్షణతో కూడిన జీవితం అలవాటు పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గురు స్వాములు నర్రా బిక్షపతి, సంజీవరెడ్డి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.