calender_icon.png 3 November, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందడం ఖాయం

02-11-2025 07:07:05 PM

గాంధారి (విజయక్రాంతి): రానున్న రోజుల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెల్లడం ఖాయమని గాంధారి తాజా మాజీ సర్పంచ్ మామ్మాయి సంజీవులు యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం రోజున ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడో దఫా క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు కు మంత్రి పదవి కట్టబెట్టడం ఖాయమని మంత్రి పదవి లభించిన తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే రెండు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నయని, మంత్రి పదవి లభించినట్లయితే మరిన్ని నిధులతో ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి వైపు ప్రయాణిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఎల్లారెడ్డి  శాసనసభ్యులు మదన్ మోహన్ రావు కి మంత్రి పదవి కట్టబెడుతుందని  ఆశాభావం  వ్యక్తం చేశారు.