02-01-2026 01:12:30 AM
చిట్యాల, జనవరి 1(విజయ క్రాంతి): క్రికెట్ టోర్నమెంట్, ప్రభుత్వ చౌదరి దుకాణాలకు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గురువారం ప్రారంభించారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ సమీపంలో ఎంపీఎల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకొని, కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహ పరిచారు.
అనంతరం చిట్యాల మున్సిపాలిటి పరిధిలోని 09వ వార్డులో నూతనంగా మంజూరైన ప్రభుత్వ చౌకధర దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. నూతన రేషన్ దుకాణాన్ని అందుబాటులో ఉన్న వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, జడల చిన్న మల్లయ్య, మారగోని ఆంజనేయులు, వనమా వెంకటేశ్వర్లు, బెల్లీ సత్తయ్య, తహసిల్దార్ విజయ, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.