16-08-2025 12:00:00 AM
నిర్మల్ ఆగస్టు 15 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కొండాపూర్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ఖానాపూర్ నియోజకవర్గ జాన్సన్ నాయక్ జిల్లా కోఆర్డినేటర్ రామ్ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము సీనియర్ నాయకులు డాక్టర్ సుభాష్ రావు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.