calender_icon.png 17 August, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

16-08-2025 12:00:00 AM

ఖైరతాబాద్, ఆగస్టు 15 (విజయ క్రాంతి) : నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప  స్వాతంత్ర సమరయోధుల ఫోటోలకు పూలమాలలు వేసి అనంతరం నిమ్స్ సిబ్బంది, వైద్యులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం  డైరెక్టర్ మాట్లాడుతూ..

ఏంతో మంది మహానుభావులు స్వాతంత్య్రం కోసం ప్రాణాల్ని అర్పించారని, మన రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కు ల్ని కల్పించిందని అన్నారు. ఆసుపత్రిలో ఉత్తమ సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా పురస్కారాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో నిమ్స్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, డీన్ లిజా రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతి వీర్, ప్రొ. సాయిసతీష్, ప్రొ. గంగాధర్, వైద్యులు కృష్ణ రెడ్డి, లక్ష్మీభాస్కర్,  మార్తా రమేష్,పారామెడికల్, నర్సింగ్ క్లాస్ ఐవీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.