calender_icon.png 31 October, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పోర్ట్స్ చీఫ్ సెక్రటరీని కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

29-10-2025 12:00:00 AM

హన్మకొండ, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు, క్రికెట్ స్టేడియం నిర్మాణంపై స్పోరట్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జెయేష్ రంజన్, వీసి అండ్ ఎండి స్పోర్ట్స్ అథారిటీ సోని బాలదేవిలను స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి మంగళవారం హైదరాబాదులో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండ లోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో తాత్కాలిక ప్రాతిపదికన స్పోరట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు.

క్రీడాకారులకు ఇండోర్, అవుట్ డోర్ క్రీడా మైదానాలు, ట్రాక్స్, హాస్టల్ వసతికి అవసరమైన మరమ్మత్తులు కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు. కావున ఆలస్యం చేయకుండా స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించేందుకు ప్రభుత్వ పరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు. జాతీయ రహదారి 163 కి అనుకోని హన్మకొండ జిల్లా ఉనికిచర్ల వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అనువైన స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. హన్మకొండ జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన జెయేష్ రంజన్ జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో తాత్కాలిక ప్రాతిపదికన స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు 14 నవంబర్ 2025 లోపు ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. క్రికెట్ స్టేడియం నిర్మాణానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ ను ఫీజుబులిటీ రిపోర్ట్ మరియు స్థల సేకరణపై నివేదికను అందించాలని ఆదేశించినట్లు ఆ నివేదికలు రాగానే క్రికెట్ స్టేడియం నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.